షూటింగ్ నుండి హీరో,హీరోయిన్ పరార్.. ఆ వెనకే చిత్ర యూనిట్.!!
on Oct 4, 2018
ఎన్నో సినిమాలు చూసి ఉంటారు. రౌడీల గ్యాంగ్ కత్తులు, కర్రలతో హీరోని రౌండప్ చేస్తారు. హీరో వాళ్లందరినీ ఒంటి చేత్తో కొట్టి.. ప్రేక్షకుల చేత ఈలలు, చప్పట్లు కొట్టించుకుంటాడు. మరి ఇదే సంఘటన బయట ఎదురైతే హీరో ఏం చేస్తాడు?.. సినిమాలో లాగా ఫైట్ చేసి వాళ్ళని మట్టికరిపించడు. సామాన్యుడిలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళనుండి తప్పించుకుంటాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే షూటింగ్ లో ఉన్న ఓ హీరోకి ఎదురైంది.
హీరో జివి ప్రకాష్, హీరోయిన్ అబర్నతి జంటగా జైల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వసంత బాలన్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల్ని చెన్నైలోని కన్నంగి నగర్ లో చిత్రీకరిస్తున్నారు. అసలే చెన్నైలో నేరాలు, హత్యలు ఎక్కువగా జరిగే ప్రాంతం అది. హీరో, హీరోయిన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. రెండు గ్యాంగ్స్ వేటకొడవళ్లతో దాడి చేసుకుంటూ షూటింగ్ స్పాట్ వైపు పరుగులు తీశారు. దీనితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హీరో జివి ప్రకాష్, హీరోయిన్ అబర్నతి పరుగులు తీసినట్లు తెలుస్తోంది. దూరంగా వెళ్లి వీరిద్దరూ ఓ ఇంట్లో దాక్కున్నారు. చిత్ర యూనిట్ కూడా షూటింగ్ కు సంబంధించిన వస్తువులన్నీ తీసుకుని పరుగులు పెట్టింది. దాదాపు 2 గంటల పాటు ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. పోలీసులు రంగంలోకి దిగాకే అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు సమాచారం. అల్లర్లు సద్దుమణిగాక ఎక్కడెక్కడో తలదాచుకున్న చిత్ర యూనిట్ లోని సభ్యులు, హీరో, హీరోయిన్ షూటింగ్ స్పాట్ కి చేరుకున్నారు. ఆ తరువాత యధావిధిగా షూటింగ్ తిరిగి ప్రారంభించారు.