వెంకటేష్, నాగార్జునలకు షాకిచ్చిన రేవంత్ సర్కార్!
on Nov 21, 2025

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియో, దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీకి చెందిన రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు.
వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ, ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. నవంబర్ 21న అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు ఇచ్చారు.
అన్నపూర్ణ స్టూడియోస్ లక్షా 92 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ.. 8,100 చదరపు అడుగులు చూపిస్తున్నారు. దీంతో 11 లక్షల 52 వేలు చెల్లించాల్సి ఉండగా.. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నారట.
రామానాయుడు స్టూడియోది కూడా ఇదే తీరు. 69 వేల చదరపు అడుగులలో వ్యాపారం చేస్తూ, రెండు లక్షల 73 వేలు చెల్లించాల్సి ఉండగా.. 1900 చదరపు అడుగులు చూపించి, రూ.7,600 మాత్రమే చెల్లిస్తున్నారట.
దీంతో పూర్తిస్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజుని వెంటనే చెల్లించాలంటూ అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



