గోపీచంద్ సిస్టర్‌గా ఒకప్పటి స్టార్ హీరోయిన్
on Jan 28, 2020

పదిహేనేళ్ల క్రితం తెలుగులో భూమిక స్టార్ హీరోయిన్. పవన్ కల్యాణ్ సరసన 'ఖుషి', మహేష్ బాబు సరసన 'ఒక్కడు', ఎన్టీఆర్ సరసన 'సింహాద్రి' వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ముందుకొచ్చారు.'ఎంసిఎ'లో నానికి వదినగా నటించారు. 'యు టర్న్'లో ఇంపార్టెంట్ రోల్ చేశారు. నందమూరి బాలకృష్ణ 'రూలర్'లో ప్రకాష్ రాజ్ కుమార్తెగా కీలక పాత్రలో కనిపించారు. లేటెస్టుగా గోపీచంద్ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించారు. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. అందులో తమన్నా హీరోయిన్. రెండు రోజుల క్రితం హైదరాబాదులో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో గోపీచంద్ సిస్టర్‌గా ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక కనిపించనున్నారు. సినిమాలో ఆమె క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉండడంతో సిస్టర్ రోల్ చేయడానికి యస్ చెప్పారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



