Home

»

Latest News

ఫ‌స్ట్ తార‌క్.. నెక్స్ట్ బ‌న్నీ.. ఆపై బాల‌య్య‌!?

Jan 25, 2022 3:56PM

అగ్ర క‌థానాయ‌కుల‌తోనే వ‌రుస సినిమాలు చేస్తున్న ద‌ర్శ‌కుల్లో కొర‌టాల శివ ఒక‌రు. తొలి చిత్రం `మిర్చి` నుంచి త‌న‌ది ఇదే బాణీ. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో `మిర్చి` తీసిన కొరటాల.. ఆన‌క సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో `శ్రీ‌మంతుడు` చేశారు. ఆ త‌రువాత యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తో `జ‌న‌తా గ్యారేజ్` తెర‌కెక్కించి.. మ‌ళ్ళీ మ‌హేశ్ తోనే `భ‌ర‌త్ అనే నేను` తీశారు. ఇక ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధ‌మైన `ఆచార్య‌`ని మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రూపొందించారు. ఏప్రిల్ 1న ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.

Also Read: అప్పుడు `బాహుబ‌లి 2`.. ఇప్పుడు `ఎఫ్ 3`..!

ఇదిలా ఉంటే.. `ఆచార్య‌` అనంత‌రం ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నున్న కొర‌టాల శివ‌.. ఆపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మ‌ల్టిలింగ్వ‌ల్ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. అంతేకాదు.. బ‌న్నీ త‌రువాత న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌తోనూ త‌న మార్క్ సోష‌ల్ డ్రామా ఒక‌టి తీసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నార‌ట‌. 2023లో బాల‌య్య - కొర‌టాల మూవీ ప‌ట్టాలెక్కుతుంద‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి.. ఫ‌స్ట్ తార‌క్, నెక్స్ట్ బ‌న్నీ, ఆపై బాల‌య్య అంటూ విజ‌న‌రీ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ చేయ‌బోతున్న ఈ ప్ర‌య‌త్నాలు.. ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తాయో చూడాలి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com