Home

»

Latest News

అప్పుడు `బాహుబ‌లి 2`.. ఇప్పుడు `ఎఫ్ 3`..!

Jan 20, 2022 2:19PM

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ లో `బాహుబ‌లి` సిరీస్ కి ప్ర‌త్యేక స్థానం ఉంది. రెండు భాగాలుగా రూపొందిన ఈ జాన‌ప‌ద చిత్రంలో అవంతిక‌గా త‌న అభిన‌యంతో మెస్మ‌రైజ్ చేసింది త‌మ‌న్నా. మ‌రీముఖ్యంగా.. `బాహుబ‌లి - ది బిగినింగ్`లో అటు గ్లామ‌ర్ తో, ఇటు పెర్ఫార్మెన్స్ తో క‌ట్టిప‌డేసిందీ ఉత్త‌రాది సోయ‌గం. అయితే, సెకండ్ పార్ట్ `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్`లో మాత్రం త‌న పాత్ర ప‌రిధి చాలా త‌క్కువ. అయిన‌ప్ప‌టికీ, ఇండియ‌న్ బాక్సాఫీస్ ముంగిట హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిలిచిన స‌ద‌రు సీక్వెల్ తో ఓ మెమ‌ర‌బుల్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంది త‌మ‌న్నా.

ఇదిలా ఉంటే.. `బాహుబ‌లి` త‌ర‌హాలో ఇప్పుడు మ‌రో ఫ్రాంచైజీతో ఎంట‌ర్టైన్ చేయ‌నుంది త‌మ‌న్నా. అదే.. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3`. 2019 సంక్రాంతి విజేత‌గా నిలిచిన `ఎఫ్ 2`కి కొన‌సాగింపుగా రూపొందుతున్న `ఎఫ్ 3`ని తొలుత ఏప్రిల్ 29న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు ఒక రోజు ముందే ఈ సినిమా రాబోతోంది. ఏప్రిల్ 28కి ఈ సీక్వెల్ విడుద‌ల కానుంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. `బాహుబ‌లి` సెకండ్ పార్ట్ కూడా 2017లో ఇదే ఏప్రిల్ 28న థియేట‌ర్స్ లో సంద‌డి చేసింది. మ‌రి.. `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్`లాగే `ఎఫ్ 3` కూడా త‌మ‌న్నాకి మ‌రో మెమ‌ర‌బుల్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com