రాజ్‌తరుణ్ పతనం ప్రారంభమైందా?
on Jan 30, 2016
.jpg)
వరుసగా మూడు విజయాలతో దూసుకుపోయాడు రాజ్ తరుణ్. మూడూ మెగా హిట్లే. చిన్న సినిమాలుగా వచ్చి కోట్లు కొల్లకొట్టాయి. దాంతో రాజ్ తరుణ్‌పై దర్శక నిర్మాతల దృష్టి పడింది. మరో రెండేళ్ల వరకూ రాజ్ కాల్షీట్లు ఖాళీ లేవు. అంత బిజీ అయిపోయాడు మరి. అయితే తాజాగా విడుదలైన సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. తొలి షోకే `రొటీన్ కథ` అనే ముద్ర వేసేశారు. రాజ్ తరుణ్ ఎనర్జీ తప్ప మరేం కనిపించలేదని పెదవి విరుస్తున్నారు విమర్శకులు. రాజ్ తరుణ్ కూడా అవసరానికి మించి ఓవరాక్షన్ చేశాడని గుసగుసలాడుకొంటున్నారు. మూడు విజయాలతో తరుణ్ రేంజ్ పెరిగిన మాట వాస్తవం. దాన్ని అలుసుగా తీసుకొని కొంతమంది నిర్మాతల దగ్గర తరుణ్ కాలర్ ఎగరేశాడట. సెట్‌కి లేట్ గా వస్తున్నాడని, ప్రమోషన్లకు కోపరేట్ చేయడం లేదని రాజ్ తరుణ్ పై విమర్శలున్నాయి. ఒకట్రెండు విజయాలు పడితే అందరూ ఇంతే నేమో. రామయ్య సినిమాతో కుర్రాడు దార్లోకి వచ్చేయడం ఖాయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



