ఆకట్టుకుంటున్న 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్.. మరో 'గీత గోవిందం' అవుతుందా?
on Mar 28, 2024

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'(Family Star). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు పరశురామ్ పెట్ల దర్శకుడు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో.. 'ఫ్యామిలీ స్టార్'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'గీత గోవిందం' తరహాలోనే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్టుగా 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ (Family Star Trailer) ఉంది. మిడిల్ క్లాస్ యువకుడిగా విజయ్ ని పరిచయం చేసిన తీరు.. కుటుంబ సభ్యులతో, చిన్న పిల్లలతో, ఆఫీస్ లో ఎలా ఉంటాడో చూపించిన తీరు మెప్పించింది. ఇక విజయ్, మృణాల్ మధ్య సన్నివేశాలు కొంచెం క్యూట్, కొంచెం ఎమోషనల్ అన్నట్టుగా ఉన్నాయి. విజయ్ మార్క్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. అసలు మృణాల్ పాత్ర ఏంటి? ఆమె విజయ్ జీవితంలోకి ఎలా వచ్చింది? వచ్చాక విజయ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. ట్రైలర్ లో విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకున్నాయి.
గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా కేయూ మోహనన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్, ఎడిటర్ గా మార్తాండ్ కె వెంకటేష్ బాధ్యతలు నిర్వహించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



