జూన్ 27 న ఏం జరగబోతుంది!..కోర్టు తీర్పుపై అందరిలో టెన్షన్
on Jun 25, 2025
ఈస్టర్ నోరాన్హా, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'రెక్కీ'(Recce)వెబ్ సిరీస్ ఫేమ్ 'పోలూరి కృష్ణ'(Poluri Krishna)దర్శకత్వంలో తెరకెక్కిన మరో వెబ్ సిరీస్ 'విరాటపాలెం(Viratapalem). పీసి మీనా రిపోర్టింగ్ అనేది ఉపశీర్షిక. థ్రిల్లర్ కథాంశాలతో రూపొందిన ఈ సిరీస్ లో అభిజ్ఞ, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలు పోషించారు. జీ 5 లో ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రీసెంట్ గా ప్రముఖ ఓటిటి సంస్థ 'ఈటీవీ విన్'(Etv Win)కోర్టుని ఆశ్రయించి 'విరాటపాలెం సిరీస్ తమ సంస్థ ద్వారా విడుదల కానున్న 'కానిస్టేబుల్ కనకం'(Constable Kanakam)కథతో సిద్ధమయ్యిందని, కాబట్టి విరాటపాలెం రిలీజ్ ని ఆపాలని కోర్టుకి విన్నవించుకుంది. దీంతో కోర్టు తీర్పుపై సినీ ప్రియుల్లో టెన్షన్ మొదలయ్యింది. కానిస్టేబుల్ కనకం' సిరీస్ లో వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్ పోషించగా, చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన కానిస్టేబుల్ కనకం గత సంవత్సరం డిసెంబర్ లోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది.
అడవి గుట్ట అనే ప్రాంతంలో ఉన్న ఒక మిస్టరీని ఛేదించే కథతో ఈ చిత్రం తెరకెక్కింది. వర్ష బొల్లమ్మ(varsha Bollamma)ఇప్పటికే అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేసి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
