ఆగడు హక్కులను కొట్టేసిన ఈరోస్
on Apr 26, 2014

పోయిన చోటే దక్కించుకోవాలనే పద్ధతిని ఈరోస్ సంస్థ బాగా పాటిస్తుంది. మహేష్ నటించిన '1 నేనొక్కడినే' చిత్రానికి భారీ మొత్తాన్ని చెల్లించి, చిత్ర హక్కులను పొందిన ఈరోస్ కి నిరాశే మిగిలింది. కానీ ఓవర్ సీస్ లో మంచి ఫలితాలను రాబట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఆగడు". 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర హక్కులను కూడా భారీ మొత్తంలో చెల్లించి ఈరోస్ సంస్థ దక్కించుకుంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురుపిస్తుందని ఆశతో ఉన్నారు ఈరోస్ సంస్థ.
ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇందులో మహేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర పాటలను త్వరలోనే విడుదల చేయనున్నారు. కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



