Home

»

Latest News

ర‌వితేజ అయినా హిట్టిచ్చేనా!?

Jan 18, 2022 2:44PM

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన `మ‌జ్ను` చిత్రంతో తెలుగు తెర‌కు నాయిక‌గా ప‌రిచ‌య‌మైంది అను ఇమ్మాన్యుయేల్. తొలి సినిమాతోనే టాలీవుడ్ లో హిట్ కొట్టిన ఈ సుంద‌రి.. ఆపై `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`, `ఆక్సిజ‌న్`, `అజ్ఞాత‌వాసి`, `నా పేరు సూర్య‌`, `శైల‌జా రెడ్డి అల్లుడు`, `అల్లుడు అదుర్స్`, `మ‌హా స‌ముద్రం` వంటి చిత్రాల్లో సంద‌డి చేసింది. అయితే, వీటిలో ఏ ఒక్క‌టీ కూడా హిట్ లిస్ట్ లో చేర‌లేక‌పోయింది.

మ‌రీముఖ్యంగా.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జంట‌గా న‌టించిన `అజ్ఞాత‌వాసి`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి జోడీగా క‌నువిందు చేసిన `నా పేరు సూర్య‌`తో త‌న కెరీర్ గ్రాఫ్ నెక్స్ట్ లెవ‌ల్ కి వెళుతుంద‌ని ఆశించిన అనుకి చేదు ఫ‌లితాలే ద‌క్కాయి.
ఈ నేప‌థ్యంలో.. రాబోయే చిత్రాలు `ప్రేమ కాదంట‌`, `రావ‌ణాసుర‌`పైనే ఆశ‌లు పెట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. `ప్రేమ కాదంట‌`లో అల్లు శిరీష్ కి పెయిర్ గా క‌నిపించ‌నున్న అను.. `రావ‌ణాసుర‌`లో మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ఆడిపాడ‌నుంది.

మ‌రి.. స్టార్ హీరోల కాంబినేష‌న్స్ లో ప‌రాజ‌యాలే పొందుతూ వ‌స్తున్న అనుకి.. చాలాకాలం త‌రువాత ర‌వితేజ వంటి స్టార్ తో చేస్తున్న `రావ‌ణాసుర‌` అయినా వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com