మే 15 న డబుల్ ఇస్మార్ట్ పండుగ!
on Apr 25, 2024
స్మాల్.. బిగ్..వెరీ వెరీ బిగ్.. ఇలా ఎనీ మూవీ అవనీయండి..అప్ డేట్ చాలా ముఖ్యం..ఎంత కాలమైనా షూటింగ్ ని జరుపుకున్నా పర్లేదు. బట్ ప్రేక్షకులకి మాత్రం అప్ డేట్ ఇస్తూనే ఉండాలి. అప్పుడే సదరు మూవీ మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని డబుల్ ఇస్మార్ట్ టీం గుర్తుంచుకుందో లేదో తెలియదు. కానీ ఆ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది
రామ్ పోతినేని అండ్ పూరి జగన్నాధ్ ప్రెస్టేజియస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. గతంలో ఇదే కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఇద్దరి అభిమానులు నిత్యం సోషల్ మీడియాని సెర్చ్ చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన వార్త వాళ్లలో ఆనందాన్ని తెచ్చింది. డబుల్ ఇస్మార్ట్ నుంచి ఫస్ట్ సాంగ్ మే 15న రిలీజ్ కాబోతుంది.ఇస్మార్ట్ శంకర్ లోని పాటల్ని మించి ఉండబోతున్నాయనే వార్త వస్తుంది. ఈ మేరకు అతి త్వరలోనే అఫిషియల్ గా ఒక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.
ఇక డబుల్ ఇస్మార్ట్ విజయం పూరి కి రామ్ కి చాలా అవసరం. ఆ ఇద్దరి గత చిత్రాలు లైగర్, స్కంద లు ప్లాప్ గా నిలిచాయి. దీంతో ఈ మూవీ ప్రత్యేకతని సంతరించుకుంది. బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. పూరి కనెక్ట్స్ పై పూరి జగన్నాద్, మాజీ నటి ఛార్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. జూన్ 14 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
Also Read