'బింబిసార' డైరెక్టర్ నటించిన షార్ట్ ఫిల్మ్ తెలుసా?
on Aug 6, 2022
ప్రస్తుతం టాలీవుడ్ లో మల్లిడి వశిష్ఠ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన 'బింబిసార' వంటి భారీ సినిమాతో దర్శకుడిగా పరిచయమవ్వడమే కాకుండా.. మొదటి సినిమాతోనే నందమూరి కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ అందించాడంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే వశిష్ఠ్ కి దర్శకుడిగా 'బింబిసార' మొదటి సినిమానే కానీ.. ఆయన సినీ పరిశ్రమకు కొత్త కాదు.
'బన్నీ'(2005), 'ఢీ'(2007) వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన మల్లిడి సత్యనారాయణ కుమారుడైన వశిష్ఠ్ మొదట నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. 2007లో వచ్చిన 'ప్రేమలేఖ రాశా' అనే సినిమాలో వశిష్ఠ్ హీరోగా నటించాడు. అప్పుడు ఆయన స్క్రీన్ నేమ్ వేణు మల్లిడి అని ఉండేది. కులశేఖర్ దర్శకత్వంలో మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించింది.
వశిష్ఠ్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాడు. మూడేళ్ళ క్రితం 'ఎన్నెన్నో వర్ణాలు' అనే షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేశాడు. తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి అతని దగ్గర డబ్బు లేకపోవడంతో తనని పెళ్లి చేసుకుందని తెలిసి మదనపడే కార్తీక్ అనే యువకుడి పాత్రలో వశిష్ఠ్ నటించి మెప్పించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
