సీనియర్ ఎన్టీఆర్ తరువాత బన్నీనే..!
on Jun 11, 2017

తెలుగు తెరపై నవరసాలను అద్భుతంగా పండించి అభిమానుల గుండెల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా నిలిచిపోయారు ఎన్టీఆర్. పాత్ర ఏదైనా సరే...ఒకసారి అనుకున్నాక, ఆయన పాత్ర విషయంలో ప్రత్యేక శద్ద తీసుకునేవారు..పాత్రకు సంబంధించిన అన్ని రకాల అంశాలను నిశీతంగా పరిశీలించేవారు. అంతేకాదు రాముడు, కృష్ణుడు, శివుడి లాంటి భగవంతుని పాత్రలు పోషించే సమయంలో ఖచ్చితమైన నియమాలు పాటించేవారు. అలా ఆ తరం వారికి..ముందు తరాల నటులకు మార్గదర్శిగా నిలిచారు అన్నగారు. ఇప్పుడు అచ్చం ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో బన్నీ నటించిన సినిమా డీజే. ఈ మూవీలో ఒక బ్రాహ్మాణ యువకుడిగా నటించారు అల్లు అర్జున్. బ్రాహ్మణుని పాత్ర కావడం, క్యారెక్టర్‌లో పర్ఫెక్షన్ కోసం బన్నీ అన్నగారిని అనుసరించాడు. నిజ జీవితంలో బ్రాహ్మణులు పాటించే నియమాలను పాటించాడు..దీనికోసం తనకు ఎంతో ఇష్టమైన మాంసాహారాన్ని మానివేయడం. ఇలా చేయడం వల్ల తెరపై అత్యంత సహజంగా కనబడవచ్చని బన్నీ స్ట్రాంగ్‌గా నమ్మాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



