'ఎస్ బాస్' అంటున్న నాని దర్శకుడు!
on Sep 28, 2022

'పిల్ల జమిందార్'(2011), 'భాగమతి'(2018) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జి.అశోక్ కొంత విరామం తర్వాత ఓ మాస్ ఎంటర్టైనర్ తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాలో హావిష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'ఎస్ బాస్' అనే టైటిల్ పెట్టారు.
దర్శకుడు అశోక్ 'భాగమతి' సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ సినిమాకు కథ, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్ర రెండో షెడ్యూల్ అక్టోబర్ మూడో వారం నుండి మొదలు కాబోతోంది.
రవితేజ హీరోగా నటించిన 'ఖిలాడి' సినిమా తరువాత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సాయి ప్రకాష్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



