వెంకీ కుడుములకి ఝలక్ ఇచ్చిన మెగాస్టార్!
on Jan 26, 2023

ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. సక్సెస్ లో ఉంటే అందరూ మనల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది పెద్దలు చెప్పే మాట. అయితే ఏ మాత్రం తేడా వచ్చినా అలా పిలిచి అవకాశం ఇస్తామని చెప్పిన వారే తూచ్ అనేస్తారు. ఇక విషయానికి వస్తే యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో వెంకీ కుడుములది సపరేట్ స్టైల్. ఎంటర్టైన్మెంట్ ను పండించడంలో దిట్టైన వెంకీ కుడుముల తన మొదటి చిత్రంగా నాగశౌర్యతో చలో చిత్రం చేశారు. ఈ సినిమా ద్వారా రష్మిక మందనను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే ఆయన నితిన్ తో రెండో చిత్రంగా భీష్మ చేశారు.
ఈ చిత్రం కూడా పెద్ద హిట్టును సాధించింది. ఇలాంటి సమయంలో వెంకి కుడుములలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ తనకు బాగా సూట్ అవుతుందని, ఆయన తనను సరిగ్గా హ్యాండిల్ చేస్తాడని భావించి చిరంజీవి పిలిచి మరీ ఆయనకు అవకాశం ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా దానయ్య ఈ సినిమాని నిర్మిస్తాడని అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుతం వెంకీ కుడుములకు మెగాస్టార్ తూచ్ ఆదేశాడట.
ప్రస్తుతానికి వెంకీ కుడుములతో సినిమా లేదని మెగాస్టార్ చెప్పేశాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇలా చేయడం సబబు కాదని వెంకీ కుడుముల మధనపడుతున్నారు. కానీ ఆయనది ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ఎందుకంటే ఎదురుగా ఉన్నది మెగాస్టార్. ఏ మాత్రం తేడా వచ్చినా తేడా వచ్చేస్తుంది. గతంలో కూడా చిరు సాహో దర్శకుడు సుజిత్ ను లూసిఫర్ రీమేక్ కోసం వాడుకున్నారు.
కానీ చివరకు ఆ చిత్రాన్ని మోహన్ రాజాకు అప్పగించారు. ఇప్పుడు అదే సంఘటన వెంకీ కుడుముల విషయంలో రిపీట్ అయింది. దాంతో చిరు ప్రాజెక్టుపై ఆశలు వదిలేసుకున్న వెంకీ కుడుముల తనకు అచ్చి వచ్చిన, తనకు బాగా పరిచయం ఉన్న హీరో నితిన్ తో చిత్రం చేయడం కోసం కసరత్తులు చేస్తున్నాడట. ఈ చిత్రంతో ముందుగా తానేమిటో నిరూపించుకుని మరోసారి మెగాస్టార్ దృష్టిలో పడతానని ఘంటాపథంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలోని అందరూ ఇప్పుడు పాపం వెంకి కుడుముల అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



