రెట్రో 'నాయక్'... వివి వినాయక్!
on May 15, 2019

దర్శకుడు వివి వినాయక్ కథానాయకుడిగా మారుతున్నారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఏడు కొండల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో శంకర్ దగ్గర శిష్యరికం చేసిన 'శరభ' దర్శకుడు ఎన్. నరసింహారావు చెప్పిన కథ 'దిల్' రాజుకు నచ్చడంతో, అతణ్ణి వినాయక్ దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయనకూ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిలింనగర్ సర్కిల్స్ అంతా మంగళవారం ఈ సినిమా చర్చే. వివి వినాయక్ కథానాయకుడిగా నటించడం ఖాయమే. మరి, ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? కథ ఎలా ఉంటుంది? లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్ ఏంటంటే... ఈ సినిమా కథ 1980 నేపథ్యంలో సాగుతుంది. తన వయసుకు తగ్గ పాత్రలో రెట్రో కథానాయకుడిగా వివి వినాయక్ కనిపిస్తారు. ప్రస్తుతానికి కథా చర్చలు మాత్రమే జరిగాయి. షూటింగ్ స్టార్ట్ కావడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుందట. ఈలోపు వినాయక్ కాస్త బరువు తగ్గాలని అనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



