ఒక్క డైలాగ్ తో 'రాజాసాబ్'పై అంచనాలు తారాస్థాయికి..!
on Jun 8, 2025

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూవీ 'ది రాజా సాబ్'. హారర్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గా రూపొందుతోన్న 'రాజా సాబ్'ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ జూన్ 16న విడుదల కానుంది. (The Raja Saab)
ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ లో సినిమా చేస్తున్నాడు. పైగా ఇందులో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని.. కామెడీ, సాంగ్స్ అదిరిపోతాయని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ 'రాజా సాబ్' కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మారుతి ఒకే ఒక్క మాటతో ఈ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళాడు.
రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్టర్ మారుతి, 'రాజా సాబ్' మూవీ గురించి మాట్లాడుతూ.. "అభిమానులు ఏం ఆశిస్తున్నారో దానికంటే ఒక శాతం ఎక్కువే రాజా సాబ్ ఉంటుంది. ప్రభాస్ పై నా ప్రేమ ఏంటో ఈ సినిమాలో చూస్తారు." అని అన్నాడు.
మారుతి మాటలను బట్టి చూస్తే.. 'రాజా సాబ్' సినిమా పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థమవుతోంది. జూన్ 16న విడుదల కానున్న టీజర్ తో అసలు 'రాజా సాబ్' చిత్రం ఏ విధంగా ఉండబోతుందో కాస్త క్లారిటీ వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



