అనిల్ రావిపూడి దర్శకప్రస్థానానికి ఆరేళ్ళు
on Jan 23, 2021

వరుస విజయాలతో ముందుకు సాగుతున్న యువ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు.. ఇలా డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమాతోనూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి అనిల్ రావిపూడి తొలిసారి మెగాఫోన్ పట్టి రూపొందించిన పటాస్ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా ఆరేళ్ళు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో అనిల్ శుభారంభం చూడడమే కాకుండా.. ట్రాక్ తప్పిన కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ ని మళ్ళీ సక్సెస్ రూట్ లోకి తీసుకువచ్చారు. మొదటి సినిమాతోనే ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించుకున్నారు.
కాగా, ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3తో బిజీగా ఉన్నారు. ఎఫ్ 2లో నటించిన విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ ఇందులోనూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. వేసవి చివరలో ఎఫ్ 3 సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



