తెలంగాణ రాష్ట్రం ఇచ్చే తొలి సినీ అవార్డ్స్ కి సహకరిస్తారా!
on Mar 12, 2025
.webp)
తెలంగాణా(Telangana)ప్రభుత్వం తెలుగు సినిమాకి అత్యంత ప్రాధానత్యని ఇస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది నుంచి ప్రముఖ సినీ,ప్రజాగాయకుడు,పాటల రచయిత,నటుడు,తెలంగాణ పోరాట యోధుడు అమరజీవి 'గద్దర్'(Gaddar)పేరుపై తెలుగు సినిమా రంగంలో విశేష ప్రతిభ కనపర్చిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తామని గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే.సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanthreddy)నే ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఇప్పుడు ఆ అవార్డ్స్ గురించి ప్రముఖ నిర్మాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju)మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో అత్యుత్తమ చిత్రాలుగా నిలిచిన వాటిని ఏడాదికి ఒకటిగా ఎంపిక చేసి ఉగాది నాడు గద్దర్ అవార్డ్స్ ప్రధానం చేయబోతున్నాం.ఫీచర్ ఫిల్మ్,జాతీయ సమైఖ్యతా చిత్రం,బాలల చిత్రం,పర్యావరణం,చారిత్రక సంపద తదితర విభాగాలతో పాటు,తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ ,షార్ట్‌ఫిల్మ్ విభాగాల్లో కూడా అవార్డులను అందిస్తాం.ఇందుకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం.
ఉర్దూ సినిమాని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఉర్దూ సినిమాతో పాటు పైడి జయరాజ్,కాంతారావు పేర్లపై కూడా ప్రత్యేక అవార్డులు ఇవ్వబోతున్నాం.అంగరంగ వైభవంగా ఈ అవార్డుల వేడుక జరగబోతుంది.తెలంగాణ రాష్టం నుంచి వస్తున్న ఈ అవార్డ్స్ కి అందరు సహకరించాలని ఆయన కోరాడు.ఇక గద్దర్ అవార్డ్స్ అందుకోవడం తెలుగు నటులకి ఎంతో గౌరవంగా కూడా భావించవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



