బాలీవుడ్ ‘ధృవ’గా సిద్ధార్థ కపూర్
on Jul 6, 2017
కొన్నిసినిమా కథలకు ప్రాంతాలతో పనుండదు. ఏ భాషలో తీసినా అవి విజయాన్ని సాధించేస్తాయి. భాగ్యరాజా తమిళంలో నటించిన ‘చిన్నరాజా’సినిమా... బాలీవుడ్ లో ‘బేటా’గా రీమేక్ అయ్యి, కలెక్షన్ల సునామీ సృష్టించింది. అదే కథతో తెలుగులో ‘అబ్బాయిగారు’ అని తీస్తే.. ఇక్కడ కూడా బంపర్ హిట్టే. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికంటే... మన రామ్ చరణ్‘ధృవ’కథ కూడా కాస్త అటు ఇటుగా అదే దారిలో పయనిస్తోంది. ‘ధృవ’మాతృక తమిళ్ ‘తన్నీ ఒరువన్’అన్న విషయం తెలిసిందే. ఈ కథను ‘ధృవ’గా తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా సూపర్ హిట్. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ మంచి విజయన్నించ్చిందీ సినిమా. ఇప్పుడు ఈ కథ హిందీలోకి రీమేక్ అవ్వబోతోంది. ఈ హిందీ సినిమాలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తారని గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఈ పాత్ర సిద్దార్థ్ మల్హోత్రాను వరించింది. తమిళ, తెలుగు భాషల్లో విలన్ గా అదరగొట్టేసిన అరవింద్ స్వామి స్థానంలో... అర్జున్ కపూర్ కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విజయాన్ని అందుకున్న ఈ కథ బాలీవుడ్ లో కూడా విజయ దుందుభి మోగిస్తుందేమో చూడాలి.