'అర్జున్‌రెడ్డి'కి తమిళ్ ఫ్లేవర్ యాడ్ చేశారట
on Nov 2, 2019
తమిళంలో 'సేతు' (తెలుగులో 'శేషు'గా రీమేక్ చేశారు), తెలుగులోనూ విడుదలైన 'శివపుత్రుడు', 'నాన్న', 'అపరిచితుడు' వంటి డిఫరెంట్ పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్ చేసిన హీరో విక్రమ్. తనయుణ్ణి హీరోగా పరిచయం చేయడం కోసం 'అర్జున్‌రెడ్డి' రీమేక్ ఎంపిక చేసుకున్నప్పుడు తమిళ ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోయారు. విక్రమ్ దృష్టి పెడితే... అంతకంటే గొప్ప కథలతో దర్శక నిర్మాతలు అతడి దగ్గరకు వెళతారని అనుకున్నారు. కానీ, విక్రమ్ 'అర్జున్‌రెడ్డి' రీమేక్ చేయడానికి మొగ్గు చూపాడు. ఏ ముహూర్తాన ఆ రీమేక్ ప్రారంభించారో గానీ అష్టకష్టాలు పడి నవంబర్ 8న విడుదలకు సిద్ధమైంది. బాల డైరెక్ట్ చేసిన రీమేక్ పక్కన పెట్టి, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ టీమ్ మెంబెర్ గిరీశయ్య దర్శకత్వంలో 'ఆదిత్య వర్మ' తీశారు.
తెలుగులో 'అర్జున్ రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్' సినిమాలకు కొంత డిఫరెంట్ గా 'ఆదిత్య వర్మ' తీశామని ధృవ్ విక్రమ్ చెబుతున్నాడు. విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్ తమ తమ స్టయిల్స్ లో హీరో క్యారెక్టర్ చేస్తే, తాను తన స్టయిల్ లో చేశానని అతడు అన్నాడు. కథలో సోల్ చేంజ్ చేయకుండా, 'ఆదిత్య వర్మ'కు లోకల్ తమిళ ఫ్లేవర్ యాడ్ చేశారట. 'కబీర్ సింగ్'పై ఫెమినిస్టులు విరుచుకుపడ్డారు. విమర్శలు చేశారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కథలో చిన్న చిన్న మార్పులు కూడా చేశారట. ఏం మార్పులు చేశారో లేదా యాజ్ ఇట్ ఈజ్ గా తీశారో... సినిమా విడుదలైతే తెలుస్తుంది.