'సార్' సెట్ లో అడుగుపెట్టాడు
on Jan 7, 2022

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'సార్', తమిళంలో 'వాతి' టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.
డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్.. నేరుగా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా 'సార్' కావడం విశేషం. నిజానికి ఈ ప్రాజెక్ట్ కంటే ముందు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్ లో ఓ సినిమా ప్రకటన వచ్చింది. కానీ ఇటీవల అనూహ్యంగా 'సార్' సినిమా తెరపైకి వచ్చింది. ప్రకటన రావడం, లాంఛ్ జరగడం, తాజాగా షూటింగ్ స్టార్ట్ కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. 'సార్' సినిమా స్టార్ట్ అయిందని తెలియజేస్తూ తాజాగా మేకర్స్ సెట్స్ లో ధనుష్ దిగిన ఫోటోని షేర్ చేశారు. ఫొటోలో ధనుష్ డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకుంటోంది. అయితే ఫొటోలో ధనుష్ ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు. ధనుష్ లుక్ ని బట్టి చూస్తే ఇది పీరియడ్ డ్రామా అని అర్థమవుతోంది.
.webp)
జి.వి ప్రకాష్‌కుమార్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్, ఎడిటర్ గా నవీన్ నూలి పని చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



