`ఆడవాళ్ళు మీకు జోహార్లు`.. డీఎస్పీ మార్చి సెంటిమెంట్!
on Mar 3, 2022

2022లో ఇప్పటివరకు మూడు సినిమాలతో పలకరించాడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్. `రౌడీ బాయ్స్`, `గుడ్ లక్ సఖి`, `ఖిలాడి`.. ఇలా డీఎస్పీ నుంచి తక్కువ గ్యాప్ లోనే వచ్చిన ఈ మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ నేపథ్యంలో.. ఈ శుక్రవారం (మార్చి 4) రిలీజ్ కాబోతున్న `ఆడవాళ్ళు మీకు జోహార్లు` ఫలితం దేవి శ్రీకి ఎంతో కీలకంగా మారింది.
కాగా, మార్చి నెలతో దేవి శ్రీ ప్రసాద్ కి మంచి అనుబంధమే ఉంది. తను సంగీతమందించిన తొలి చిత్రం `దేవి` (1999) మొదలుకుని `వెంకీ` (2004), `లెజెండ్` (2014), `రంగస్థలం` (2018) వరకు మార్చి నెలలో రిలీజైన పలు తెలుగు సినిమాలు డీఎస్పీకి విజయాలను, గుర్తింపుని అందించాయి. మరి.. తనకి మంచి ట్రాక్ రికార్డు ఉన్న మార్చి నెలలో రాబోతున్న `ఆడవాళ్ళు మీకు జోహార్లు` కూడా విజయం సాధించి.. దేవి శ్రీని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తుందేమో చూడాలి.
Also Read: సుధీర్ పెళ్లాడిన ఈ అమ్మాయి ఎవరు?
ఇదిలా ఉంటే, `ఆడవాళ్ళు మీకు జోహార్లు`లో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటించగా రాధిక, ఖుష్బూ, ఊర్వశి ఇతర ముఖ్య పాత్రల్లో ఎంటర్టైన్ చేయనున్నారు. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



