తన పాటల రహస్యాన్ని చెప్పిన దేవిశ్రీప్రసాద్..ఒరిజినల్ ట్యూన్స్ అనుకుంటున్నాం కద
on Mar 15, 2025
.webp)
దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad)సంగీతానికి ఉన్న బ్రాండ్ ఏ పాటిదో ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు.మెలోడీ,బీట్,రాంప్,ఫోక్,పేరడీ ఇలా సంగీతానికి సంబంధించి ఎన్నిరకాల ట్యూన్స్ ఉంటాయో,వాటన్నిటిలో రెండున్నర దశాబ్దాల నుంచి అద్భుతమైన ట్యూన్స్ ని అందిస్తూ ప్రేక్షకులకి సరికొత్త ఎనర్జీని ఇస్తు వస్తున్నాడు.మ్యూజిక్ తో ఒక మూవీని ప్రేక్షకుల చెంతకు చేరవేయ్యడంతో పాటు,ఆ మూవీ ఘన విజయంలో కూడా కీలక పాత్ర పోషించడం దేవి స్టైల్. లేటెస్ట్ గా 'పుష్ప 2 'తండేల్' తో విజయాల్ని అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు.
దేవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన సంగీతంలో వచ్చిన పాటల గురించి మాట్లాడుతు ఒక సాంగ్ విని స్ఫూర్తి పొందటం అంటే అలాంటి ఇంకో పాటని ట్యూన్ చెయ్యడం,అంతే కానీ కాపీ కొట్టడం కాదు.నా పాటల్ని చాలా మంది కాపీ కొట్టారు.కానీ నేను మాత్రం కాపీ కొట్టను.ఇప్పటి వరకు రీమేక్ సాంగ్స్ కూడా చెయ్యలేదు.గద్దల కొండ గణేష్ మూవీకి సంబంధించి ఒక పాటని రీమేక్ చేయాలన్నారు.అలా చెయ్యడం ఇష్టం లేక ఆ సినిమాని వదిలేసాను,దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయాన్నీ చాలా పాజిటివ్ గా తీసుకున్నాడు.
నేను పని చేసిన దర్శకులందరు నా అభిప్రాయాలని గౌరవిస్తారు.'ఉప్పెన' మూవీలోని'నీ కన్నునీలిసముద్రం' ట్యూన్ విని సుకుమార్ అసూయపడ్డారు.నా శిష్యుడు బుచ్చిబాబుకి ట్యూన్ ఇస్తున్నావు కాబట్టి ఒకే లేదంటే నా సినిమాకి వాడేవాడ్నినని అన్నారు.పుష్ప 2(Pushpa 2)లోని 'సూసేకి' సాంగ్ ని 10 నిమిషాల్లో పూర్తి చేస్తే ఆ పాట విని ఆనందంతో సుకుమార్(Sukumar)చంద్రబోస్(Chandrabose)డాన్స్ చేసారని చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



