ఆ కామెడీ నటుడ్ని శరీరం కమిలిపోయేలా కొట్టాడు..ఇప్పుడే ఈ విషయం ఎందుకు బయటకొచ్చింది
on May 27, 2025
లీలామహల్ సెంటర్, బ్లేడ్ బాబ్జి, కెవ్వుకేక, ఆడుతూ పాడుతూ, మిస్టర్ పెళ్లి కొడుకు వంటి పలు కామెడీ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు దేవీప్రసాద్(Devi Prasad)తన సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడుగా ఎన్నో అద్భుతమైన పాత్రలని పోషిస్తూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఆయనొక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
అందులో మాట్లాడుతు 'నేను కో డైరెక్టర్(Co Director)గా పని చేస్తున్నప్పుడు ఒక సీనియర్ హాస్యనటుడి పక్కన నటించడానికి మరో హాస్య నటుడు అవసరమయ్యాడు. దాంతో ఈవివి సత్యనారాయణ సినిమాలో చేసిన ఒక నటుడు గుర్తుకు వచ్చి, విజయవాడ(VIjayawada)లో ఉంటున్నాడని తెలిసి షూటింగ్ కి పిలిపించాను. సీనియర్ కామెడి నటుడు, అప్ కమింగ్ కామెడీ నటుడి మధ్య సీన్ చేస్తున్నాం. అవసరం లేకపోయినా కూడా సీనియర్ కామెడి నటుడు సదరు కామెడి నటుడ్ని కొడుతు డైలాగ్స్ చెబుతున్నాడు. ఆ నటుడేమో నాలుగైదు డైలాగ్స్ చెప్పి ఆగిపోతున్నాడు. దాంతో సీనియర్ కమెడియన్ చాలా కోపంతో అప్ కమింగ్ కామెడీ నటుడ్ని ఉద్దేశిస్తూ 'ఎక్కడ్నుంచి తీసుకొచ్చారయ్యా, టైమింగ్ లేదు ఏం లేదని అన్నాడు. ఆ తర్వాత మరో టేక్ కి రెడీ అయ్యాం. ఈ సారి సీనియర్ కామెడి నటుడు రెచ్చిపోయి కొడుతు డైలాగులు చెప్తుంటే సహా నటుడు ఓపిగ్గా సీన్ ని పూర్తి చేసాడు. సీన్ బాగా రాలేదని తెలిసినా కూడా నెగిటివ్ తక్కువ ఉండటం వలన దర్శకుడు(Director)ఓకే చెప్పాడు.
ఆ తర్వాత జూనియర్ కామెడీ నటుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతు 'నన్ను మీరెంతో నమ్మకంతో పిలిపిస్తే క్యారక్టర్ కి సరైన న్యాయం చెయ్యలేకపోయాను. సీనియర్ నటుడు నన్ను షాట్ లో విపరీతంగా కొడుతుంటే ఏకాగ్రత మొత్తం పోయిందని చెప్పాడు. ఆ సమయంలో ఆయన కళ్ళ వెంట నీళ్లు కూడా వస్తున్నాయి. షర్ట్ విప్పి వీపుని చూపిస్తే చేతి వేళ్ళ అచ్చులు ఎర్రగా ముద్రపడి ఉన్నాయి. షాట్ జరుగుతున్నప్పుడే ఈ విషయం మాకు తెలుసనీ ఆయనతో చెప్పాను. కళాకారులు చాలా సున్నిత మనసు గలిగిన వారుగా ఉంటారనే మాట, కొందరి విషయంలో మాత్రమే నిజం. వాళ్ళల్లో కూడా ఈర్ష్య, అసూయపరులు ఉన్నారు. అన్నిటికంటే గొప్ప కళ మానవత్వం. అతి తక్కువ మందికి మాత్రమే ఆ కళ ఉంటుందని దేవీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
