ఎన్టీఆర్ మూవీ నుంచి దేవి శ్రీ అవుట్..!
on Sep 29, 2014

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో జరుగుతున్న సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ను తప్పించారట. ప్రస్తుతం ఈయన స్థానంలో అనూప్ రూబెన్స్ ను తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఎన్టీఆర్ నటించిన అనేక సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు. కానీ ఈ సినిమా నుంచి ఆయనను సడన్ ఎందుకు తప్పించారో అనేది మాత్రం సస్పెన్స్ గానె వుంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే గతంలో కూడా అనూప్ రూబెన్స్ కి ఎన్టీఆర్ సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం అనూప్ కి దక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



