దేవర సెన్సార్ రిపోర్ట్.. ఆ 40 నిమిషాలు...
on Sep 10, 2024

సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన 'దేవర' ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ విజువల్ వండర్ లా ఉంది. అసలే సినిమాపై భారీ అంచనాలుండగా.. ట్రైలర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పవచ్చు. అయితే ట్రైలర్ జస్ట్ శాంపిల్ మాత్రమే అని.. సినిమా అంతకుమించి ఎన్నో రెట్లు ఉంటుందని తెలుస్తోంది. (Devara Trailer)
ఈరోజు 'దేవర' ట్రైలర్ విడుదల కావడం మాత్రమే కాదు.. సెన్సార్ కూడా పూర్తయింది. దేవర సెన్సార్ టాక్ చాలా పాజిటివ్ గా ఉంది. కొరటాల రాసిన కథాకథనాలు ఆకట్టుకున్నాయని.. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. సొరచేతతో ఎన్టీఆర్ ఫైట్ సీన్ కి థియేటర్లు షేక్ అవడం ఖాయమని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్లాక్, దేవర (ఫాదర్ రోల్) ఎపిసోడ్స్ మైండ్ బ్లోయింగ్ అంట. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు అదిరిపోయిందని, గూస్ బంప్స్ తెప్పించేలా పతాక సన్నివేశాలను ప్లాన్ చేశారని టాక్. ఊహించని ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారని అంటున్నారు. (Devara Movie)
దేవరపై జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర లో ఆ 40 నిమిషాలు అద్భుతంగా ఉంటుందని, కొరటాల సృష్టించిన ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చూపించడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నానని అన్నాడు. సెన్సార్ టాక్, ఎన్టీఆర్ మాటలను బట్టి చూస్తుంటే.. దేవర బాక్సాఫీస్ దగ్గర వండర్ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



