పృథ్వీ తో జత కట్టిన సుమయ రెడ్డి..కథ, నిర్మాత కూడా ఆమెనే
on Jan 17, 2024
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశం రావాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఒక అమ్మాయి హీరోయిన్ గానే కాకుండా నిర్మాత గాను,కథకురాలుగాను చెయ్యడం అంటే ఆమెలో ఎంతో టాలెంట్ ఉంటేనే గాని అది సాధ్యం కాదు.ఇలాంటి మల్టిఫుల్ టాలెంట్ కలిగిన నటి సమయరెడ్డి(sumaya reddy)తాజాగా ఈ మూవీ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది
సుమయరెడ్డి, పృథ్వీ అంబర్ హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న చిత్రం డియర్ ఉమ (Dear uma) లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా శరవేగంగా పూర్తి చేసుకొని అతి త్వరలోనే డియర్ ఉమ ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వ బాధ్యతలని చేపట్టాడు.ఆమని, కమల్ కామరాజు, రాజీవ్ కనకాల, సప్తగిరి, అజయ్ ఘోష్,లాంటి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
కళకి సంబంధించి చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధం ఉండదు. అలాగే ప్రేక్షకులు కూడా సినిమా బాగుంటే ఆదరిస్తారనే విషయం చాలా సార్లు రుజవయ్యింది. ఇప్పుడు ఈ డియర్ ఉమ కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
