దాసరి మృతికి ఆ సర్జరీ యే కారణమా?
on Jun 7, 2017
.jpg)
ఆరు నెలల క్రితం బాగానే ఉన్న దాసరి నారాయణ రావు గారు అంత సడన్ గా ఎలా అనారోగ్యం పాలయ్యారు... చివరికి ప్రాణాలు ఎలా కోల్పోయారు అని ఆయనని దగ్గరగా చూసిన వాళ్ళు అభిప్రాయ పడ్డారు. అయితే, దాసరి మృతికి అసలు కారణం ఏంటో అయన కూతురు వివరించింది. బరువు తగ్గడానికి దాసరి గారు పోయిన సంవత్సరం బెలూన్ సర్జరీ చేయించుకున్నారని... అది మంచి ఫలితాలిచ్చిందని... కానీ రెండవ సారి అదే సర్జరీ కి వెళ్ళినప్పుడు వేరే డాక్టర్ చేసారని... అది కాస్త ఫెయిల్ అయ్యి పెద్దాయన బాగా ఇబ్బంది పడ్డాడని, అయన కూతురు వివరించింది. వరుస సర్జరీలు, రెండు నెలల మెడికేషన్ తర్వాత ఆయన ఆరోగ్యం కుదుటపడిందని. కడుపులో ట్యూబ్ ఉండడంతో కేవలం జ్యూస్ లు మాత్రమే తీసుకునే వారని. ఒక నెల తర్వాత బెలూన్ సర్జరీ వల్ల జరిగిన అనర్ధాన్ని తగ్గించుకునేందుకు మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లాడని... కానీ, సర్జరీ మళ్ళీ ఫెయిల్ అవడంతో అవయవాలు పనిచేయడం మానేసి, తర్వాత తుది శ్వాస విడిచారని... దాసరి మృతికి అసలు కారణం వివరించింది ఆయన కూతురు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



