పరమ వీర చక్ర ఎఫెక్టేనా ఇది..??
on May 4, 2015
.jpg)
దాసరి నారాయణరావు అంటేనే సంచలనాలకు నెలవు. ఆయన సినిమాలే కాదు, మాటలూ అంతే హీటు పుట్టిస్తుంటాయి. వెండి తెరపై - ఎన్నో ప్రయోగాలు - ఇంకెన్నో అద్భుతాలు సృష్టించారు. అయితే.. ట్రెండుతో పాటు మారాల్సివచ్చినప్పుడు మాత్రం.. మారలేదు. 150వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే ఉద్దేశంతో నందమూరి బాలకృష్ణని కథానాయకుడిగా ఎంచుకొని - పరమవీర చక్ర రూపొందించారు. బాలయ్య - దాసరి కాంబినేషన్ అనగానే నందమూరి అభిమానులు సంబరపడ్డారు. మరో బొబ్బిలి పులి అవుతుందనుకొన్నారు. అయితే.. వారి అంచనాల్ని ఈ సినిమా అందుకోలేకపోయింది. దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకొంది. ఈసినిమాకి కనీసం ప్రారంభవసూళ్లు కూడా లేకుండా పోయాయి. మరో విచిత్రం ఏంటంటే... ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఇంత వరకూ అమ్ముడుపోలేదు. స్టార్ హీరోని పెట్టుకొని ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా, అభిమానుల ఆశల్ని, అంచనాల్ని అందుకొనే విధంగా సినిమా తీయలేను - అనే విషయం దాసరికి రూఢీ అయిపోయింది. వవన్ కల్యాణ్ సినిమాపై పరమవీర చక్ర ఎఫెక్ట్ పడింది. దాసరి - పవన్ ల కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తాను కాకుండా మరో దర్శకుడ్ని ఎంచుకొనే ప్రయత్నంలో ఉన్నారు దాసరి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలన్న ఆశ ఉన్నా.. ఆ ప్రయత్నాన్ని మానుకొన్నారు. ఈతరం అభిరుచులకు అనుగుణంగా, మసాలా ఐటెమ్స్ తో సినిమా చేయలేను.. అని దాసరి సిన్సియర్‌గా ఒప్పుకోవడం విశేషం. ఒకవేళ పరమవీర చక్ర, ఇటీవల వచ్చిన ఎర్రబస్సు సినిమాలు హిట్టయితే.. పవన్ సినిమాకి దాసరే దర్శకుడైపోదురేమో..?? మొత్తానికి దాసరి - పవన్‌ల నుంచి ఓ మాస్ యాక్షన్ సినిమా వస్తుందనేది మాత్రం రూఢీ అయ్యింది. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



