హాస్పటల్ వద్ద దర్శన్ భార్య.. ఆపరేషన్ తప్పదా!
on Nov 2, 2024

రేణుక స్వామి(renuka swami)ని చంపిన కేసులో జైలులో ఉన్న ప్రముఖ కన్నడ హీరో దర్శన్(darshan)కి బెంగుళూరు కోర్టు ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్య పరమైన కారణాలని దర్శన్ కోర్టుకి చూపించడం వల్లనే బెయిల్ వచ్చింది.
దీంతో దర్శన్ కంగేరి లోని ఒక హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో ఆయన భార్య విజయలక్ష్మి కూడా వెంట ఉంది. ఇక ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్ మాట్లాడుతు ఎడమ కాలు, వెన్నునొప్పితో దర్శన్ బాధపడుతున్నాడు.ఎడమ కాలు అయితే మరి బలహీనంగా ఉంది.ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చెయ్యలేదు.పూర్తిగా పరీక్షించాకే ఏం చెయ్యాలో ఆలోచిస్తాం.ప్రస్తుతానికి ఏంఆర్ఐ, ఎక్స్ రే, రక్త పరీక్షలు నిర్వహించాం. ఏంఆర్ఐ రిపోర్ట్ వచ్చాక అవసరం అనుకుంటే ఆపరేషన్ చేస్తాం.లేదంటే ఫిజియోథెరపీ చేస్తామని చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



