బాలకృష్ణ, ప్రభాస్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!
on Mar 23, 2025
తెలుగునాట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు, ఇన్‌ఫ్లుయన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి. తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులో టాలీవుడ్ బడా స్టార్స్ బాలకృష్ణ (Balakrishna), ప్రభాస్ (Prabhas) లపై పోలీసులకు ఫిర్యాదు అందటం హాట్ టాపిక్ గా మారింది.
ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ కి హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారంటూ రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ యాప్ వల్ల ఎందరో డబ్బు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. (Betting App Case)
బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారంటూ విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి వంటి హీరోలపై కూడా ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే తాము స్కిల్ బేస్డ్ గేమ్స్ కి మాత్రమే ప్రమోషన్ చేశామని విజయ్, రానా క్లారిటీ ఇచ్చారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
