'30 ఇయర్స్..' కి బ్రేక్ వచ్చింది
on Sep 28, 2014
30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఖడ్గం సినిమాతో సూపర్ పాపులరైన పృథ్వి.. ఆ తర్వాత ఒకటిన్నర దశాబ్దంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఐతే తను ఆశించిన బ్రేక్ ఎట్టకేలకు లౌక్యం సినిమాతో వచ్చింది. ఈ సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లూ పేరుతో పృథ్వి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రొటీన్ సినిమా అంటూ పెదవి విరిచిన వాళ్లంతా పృథ్వి కామెడీ మాత్రం కేక అంటున్నారు. బాయిలింగ్ స్టార్ చేసిన హంగామా సూపర్ అంటున్నారు. అప్పట్లో దుబాయ్ శీనులో ఎమ్మెస్ నారాయణ వేసిన ఫైర్ స్టార్ సాల్మన్ రాజు క్యారెక్టర్ కు ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు పృథ్వికి బాయిలింగ్ స్టార్ బబ్లూతో అంతే పేరు వస్తోంది. లౌక్యంలో బ్రహ్మానందం కూడా బాగానే నవ్వించినా.. ఆయనకన్నా పృథ్వికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. రొటీన్ గా సాగిన సినిమాను కాపాడింది పృథ్వినే అంటున్నారంతా. ఇటు ప్రేక్షకులు, విమర్శకులు అందరూ పృథ్విపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
