హాస్యనటుడు కొండవలస ఇక లేరు
on Nov 3, 2015

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులలో ఒకరైన కొండవలస ఈరోజు హఠాన్మరణం చెందారు. అనారోగ్యంతో హైద్రాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కొండవలస పూర్తి పేరు కొండవలస లక్ష్మణరావు. ఆగస్టు 10 1946వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా కొండవలస గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు. వంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' కొండవలస లక్ష్మణరావుకి తొలి సినిమా. తక్కువ కాలంలోనే వేగంగా అవకాశాలు దక్కించుకున్న కొండవలస, ప్రముఖ కమెడియన్ గా వెలుగొందారు.సినిమాల్లోకి రాకముందు విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో క్లర్క్‌గా ఉద్యోగం చేశారు. ఉద్యోగాల్లో చేస్తూనే నాటకాల్లో నటించారు. నాటక రంగంలోనూ అనేక అవార్డుల్ని కొండవలస సొంతం చేసుకున్నారు. దాదాపు 300 సినిమాల్లో నటించారాయన. ఓ గొప్ప నటుడిని పరిశ్రమ కోల్పోయింది. కొండవలస కుటుంబానికి తెలుగువన్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



