అప్పుడు `గీతాంజలి`.. ఇప్పుడు `థాంక్ యూ`..
on Jun 10, 2021

కింగ్ నాగార్జున పలు ప్రేమకథా చిత్రాల్లో సందడి చేశారు. అయితే, తన కెరీర్ లో ఓ అద్భుత ప్రణయ దృశ్య కావ్యంలా నిలిచింది మాత్రం `గీతాంజలి` (1989) చిత్రమనే చెప్పాలి. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం టేకింగ్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతంతో పాటు స్టార్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరా పనితనం కూడా `గీతాంజలి`ని ఓ క్లాసిక్ లా మలిచింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అప్పటికే తమిళ, మలయాళ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన శ్రీరామ్ కి.. తెలుగులో `గీతాంజలి`నే మొదటి సినిమా. ఆ తరువాత `శుభ సంకల్పం`, `ఖుషి`, `ఇష్క్`, `నా నువ్వే`, `రంగ్ దే` వంటి చిత్రాలకు పీసీ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
కాగా, `గీతాంజలి` తరువాత మళ్ళీ నాగ్ చిత్రానికి పనిచేయని పీసీ శ్రీరామ్.. ప్రస్తుతం నాగ్ తనయుడు నాగచైతన్యతో జట్టుకట్టారు. వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఆ చిత్రమే.. `థాంక్ యూ`. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్న అంశాల్లో పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహణం కూడా ఒకటి. మరి.. నాగ్ కి అచ్చొచ్చిన `పీసీ` ఫ్యాక్టర్.. చైతూకి కూడా కలిసొస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. `థాంక్ యూ`లో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ నాయికలుగా నటిస్తున్నారు. అన్నీ కుదిరితే, ఈ ఏడాది చివరలో ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



