ENGLISH | TELUGU  

‘చిత్తం మహారాణి’ మూవీ రివ్యూ

on Jan 21, 2023

టైటిల్ : చిత్తం మహారాణి
తారాగణం: రచన ఇందర్, యజుర్వేద్ గుర్రం, తులసి, సునీల్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు
నిర్మాత: జే ఎస్ మణికంఠ
ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి
కూర్పు : కార్తిక శ్రీనివాస్
సంగీతం: గౌర హరి
మాటలు : సురేష్ సిద్ధాని
నిర్మాణ సంస్థ: లిటిల్ థాట్స్ సినిమాస్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆకుల కాశీ విశ్వనాథ్.
రిలీజ్: ఓటిటి ‘ఆహా’

కథ:

చైత్ర బిటెక్ లో టాపర్ గా నిలిచి జాబ్ కోసం బెంగుళూరులో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. అందులో పది లక్షల ప్యాకేజీతో జాబ్ సంపాదించి ఆ విషయం వాళ్ళ నాన్నకి కూడా తెలియజేస్తుంది. ఇక తెల్లవారితే బయల్దేరాలి. అప్పుడే ప్రధానమంత్రి లాక్ డౌన్ విధిస్తాడు. అన్ని దార్లు మూసివేయబడ్డాయి. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, చైత్ర ఉంటున్న హోటల్ వాళ్ళు బయటకు పంపించేస్తారు. ఇక వాళ్ళ స్నేహితులకు ఫోన్ చేసి సాయమడిగితే ఎవరూ కూడా సహకరించరు. ఇక తన మరో ఫ్రెండ్ సలహా మేరకు ఒక యాప్ ఇన్ స్టాల్ చేసుకొని  బెంగుళూరు నుండి తన ఊరికి వెళ్ళేవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తే రాజు అని ఒకతను పరిచయమవుతాడు. ఇక చైత్ర, రాజు ఇద్దరు బెంగుళూరు నుండి బైక్ మీద ప్రయాణం మొదలుపెడతారు. ఆ దారిలో రాజుని డ్రైవర్ అంటూ తను ఓ మహారాణిలా అటిట్యూడ్ చూపిస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉండగా మరోవైపు సునీల్ పోలీస్ ఆఫీసర్ గా పరిచయం అవుతాడు. అతని దగ్గరకి తమ పాప మిస్ అయ్యిందని కంప్లెంట్ ఇవ్వడానికి ఇద్దరు తల్లిదండ్రులు వస్తారు. అయితే చివరి నిమిషంలో కిడ్నాపర్స్ కాల్ చేసి బెదిరించారని చెప్తూ,  మా పాప ప్రాణాలే ముఖ్యమని, కంప్లెంట్ రిటర్న్ తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుండి వచ్చేస్తారు.  అయితే ఈ కేస్ ని సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు సునీల్. అతని ఇన్వెస్టిగేషన్ లో అతనికి కిడ్నాప్ చేసిన బైక్ నెంబర్ తెలుస్తుంది. ఆ బైక్ నెంబర్ అన్ని స్టేషన్లకు పంపించి టోల్ గేట్స్ వద్ద వెతికిస్తూ ఉంటాడు. పోలీసులు వెతుకుతూ ఉన్న బైక్ నెంబర్, చైత్ర బుక్ చేసుకున్న బైక్ నెంబర్ ఒక్కటే. అయితే పోలీసుల కళ్ళుగప్పి రెండు టోల్ గేట్లు దాటేస్తాడు రాజు. కానీ ఒక దగ్గర పోలీసులకి దొరికేస్తాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ గా సత్య వచ్చి రాజు, చైత్రలని ఇంటారాగేట్ చేస్తుంటాడు. అసలు ఎందుకు మీరు తప్పించుకొని వస్తున్నారు..మీ స్టోరీ ఏంటి అని చెప్పమని అడుగుతాడు సత్య. దీంతో చైత్ర తనకి చిన్నతనం నుండి పరిచయమని వాళ్ళిద్దరిది ఒకే ఊరని.. చైత్రని తను లవ్ చేశాడని కథ చెప్తూ ఉంటాడు. రాజు, చైత్రలు ఇద్దరు పోలీసులని దాటి వాళ్ళ గమ్యాన్ని చేరుకున్నారా? కిడ్నాప్ అయిన పాప దొరికిందా? అసలు రాజు క్రిమినలా లేక మంచివాడా ? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే..

విష్లేషణ:

కథలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా వీక్షిస్తారు. అలాంటి కోవలోకి చేరిందే ఈ 'చిత్తం మహారాణి'. ఏది చెప్పినా వినని చైత్ర పాత్రలో రచన,  అన్నింటికి సరే అని చెప్పే రాజు పాత్రలో యజుర్వేద్.. వీరిద్దరి మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. ఉన్నంతలో కామెడి కూడా ఆకట్టుకుంటుంది. ఎక్కడా బోర్ కొట్టనీకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేసాడు డైరెక్టర్ కాశీ విశ్వనాథ్. సురేష్ సిద్ధాని మాటలు బాగున్నాయి. ముఖ్యంగా హీరో , హీరోయిన్ మధ్య సంభాషణలు సినిమాకి ప్రాణం పోసాయి. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి మరింత అందాన్ని సమకూర్చింది. గౌర హరి సమకూర్చిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:  

రాజు పాత్రలో యజుర్వేద్ ఆకట్టుకున్నాడు. పొగరు, ఆటిట్యూడ్ గల అమ్మాయిగా చైత్ర పాత్రలో రచన ఇందర్ అభినయాన్ని చూపింది. డైరెక్టర్ కాశీ కథని నడిపించిన తీరు బాగుంది. చివరి ఇరవై నిమిషాలు మూవీని వేరే లెవెల్ లో తెరకెక్కించాడు. కథలోకి సత్య వచ్చినప్పటి నుండి ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారు. సపోర్టింగ్ క్యారెక్టర్ గా హీరో ఫ్రెండ్స్ పర్వాలేదనిపించారు. 

తెలుగు వన్ పర్స్పెక్టివ్ :  

చిన్న సినిమా అయిన కథలో కొత్తదనం ఉంది. ఎలాంటి అసభ్యతా లేకుండా సస్పెన్స్, కామెడీ, ట్విస్ట్ లు అన్నీ ఉన్న ఈ 'చిత్తం మహారాణి' చిత్రాన్ని ఓసారి చూసేయొచ్చు.

రేటింగ్ : 3 /5

✍🏻. దాసరి మల్లేశ్

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.