శ్రీజ పెళ్లి... మీడియాకి చిరంజీవి వార్నింగ్!
on Mar 9, 2016

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వివాహం ఎప్పుడు, ఎక్కడ అనే విశేషాలకు కోసం చిరు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె వివాహం బెంగుళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్ లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆమె వివాహం జైపూర్ లేదా ఉదయ్‌పూర్ లో జరుపాలని ప్లాన్ చేసారు. సమ్మర్ మొదలై ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రయాణాల పరంగా కాస్త ఇబ్బంది అవుతుందని భావించి... చివరకు బెంగుళూరులోని ఫాం హౌజ్‌లో చేయాలని ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా మెగాస్టార్ చిరంజీవి శ్రీజ పెళ్లికి చాలా తక్కువ మందినీ అందునా చాలా దగ్గర బంధువులను మాత్రమే పిలుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఈ పెళ్లిని లైవ్ లో కవర్ చేయడాన్కి అనుమతి ఇవ్వాలంటూ చాలా చానెల్స్ ఓపెన్ ఆఫర్ ఇచ్చాయట. కావాలంటే గేటు దగ్గర వుండి కవర్ చేసుకోండి అంతేకానీ లోపలకు వచ్చి కవర్ చేయొద్దు అని మెగాస్టార్ చెప్పేశాడట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



