రజనీని పరామర్శించనున్న చిరంజీవి
on Jun 21, 2011
రజనీని పరామర్శించనున్న చిరంజీవి అని ఫిలిం నగర్ లో వినపడుతోంది. వివరాల్లోకి వెళితే సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తను హీరోగా త్రిపాత్రాభినయం చేస్తున్న "రాణా" సినిమా ప్రారంభోత్సవం రోజున అనుకోకుండా హాస్పిటల్ పాలయ్యారు. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత మరో మూడుసార్లు ఒకే నెలలో హాస్పిటల్ పాలయ్యారు. ఆయన పూర్తిగా కోలుకునే నిమిత్తం సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్ కు ఆయన్ని తరలించారు.
.jpg)
అప్పటి నుండీ రజనీకాంత్ అక్కడే ఉండి హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్నా కూడా ఇంకా అక్కడే ఉన్నారు. ఆయన్ని పరామర్శించటానికి మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి ఈ రోజు ఉదయం అంటే జూన్ 21 వ తేదీన, సింగపూర్ కి బయలుదేరి వెళ్ళారని సమాచారం. రజనీ కాంత్, చిరంజీవి ఇద్దరూ మంచి మిత్రులన్న సమగతి ప్రేక్షకులకు తెలిసిన సంగతే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



