ఎన్టీఆర్, చరణ్‌ల 200 కోట్ల బడ్జెట్ కథ ఇదే...
on Jan 17, 2018
ఆక్షన్ బ్యాక్ డ్రాప్ లో అన్నదమ్ముల సినిమా అంటే ప్రప్రధమంగా గుర్తొచ్చే మూవీ మణి రత్నం తీసిన క్లాసిక్ ఘర్షణ. ఇదే కథని అటు ఇటుగా మార్చి కొందరు డైరెక్టర్లు సినిమాలు తీశారు. అయితే, వాటిలో సక్సెస్ శాతం కాస్త ఎక్కువే. ఎందుకంటే, ఆ కథ కున్న కమర్షియల్ వాల్యూ అలాంటిది మరి. ఇప్పుడు రాజమౌళి కూడా దాదాపు ఇదే స్టోరీ లైన్ ని తన తదుపరి చిత్రం కోసం ఎన్నుకున్నాడని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసిన కథలో కథానాయకులిద్దరు అంటే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అన్నదమ్ములుగా కనిపిస్తారట.
ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇస్తూ యాక్షన్ పాళ్ళు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయట. దాదాపు 150 నుండి 200 ల కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాకి రెమ్యునరేషన్ల రూపంలోనే సగం పైన డబ్బులు వెచ్చించనున్నారట నిర్మాతలు. రాజమౌళి ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ సినిమాలో గ్రాఫిక్ కి తావు లేదు. కేవలం 9 నుండి 10 నెలల్లోనే సినిమా పూర్తి చేసి 2019 దసరాకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల చేస్తారట. రాజమౌళి బ్రాండ్ నేమ్ తో దేశం మొత్తం ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయం.
Jr NTR Ram Charan Film, Rajamouli Multistarrer Movie, NTR Ram Charan Movie Budget, Rajamouli Remuneration, NTR Ram Charan Film Story