ENGLISH | TELUGU  

కర్మ ఎవర్ని వదలదు.. బడా హీరో సినిమాలపై చిన్మయి సంచలన వ్యాఖ్యలు 

on Nov 3, 2025

 

-చిన్మయి సంచలన వ్యాఖ్యలు 
-కర్మ వదలదనే విషయం మర్చిపోతున్నారు
-జానీమాస్టర్, కార్తీక్ కి అవకాశాలు ఎలా వస్తున్నాయి
- పెద్ది, ఆంధ్రకింగ్ తాలూకు తో బిజీ 

 

ఎంటైర్ దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 'చిన్మయి'(Chinmayi)కి ఉన్న చరిష్మా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాంగ్స్ ని ఎంత మధురంగా ఆలపించగలదో, డబ్బింగ్ ని కూడా అంతే మధురంగా చెప్పగలదు. ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పై జరిగే  లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా తన వాదనని వినిపించడంలో ఎప్పుడు ముందుంటుంది.

 

రీసెంట్ గా చిన్మయి 'ఎక్స్'(X)వేదికగా స్పందిస్తు ఆడవాళ్ళని లైంగిక వేధింపులకి గురి చేసిన జానీ మాస్టర్(Janimaster),సింగర్ కార్తీక్(Karthik)కి  ఇండస్ట్రీ లో అవకాశాలు ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. డబ్బు,అధికారం వాళ్ళ చేతుల్లో ఉంచడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు ఉంటుందని తెలపడం కూడా అవుతుంది. కర్మ సిద్ధాంతాన్ని మర్చిపోకండి. అది తిరిగి చేరాల్సిన వాళ్ళ దగ్గరకే చేర్చుతుందని ట్వీట్ చెయ్యడం జరిగింది. కొన్ని నెలల క్రితం జానీమాస్టర్ పై తోటి కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ చేసిన లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్  జైలు శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రెస్టేజియస్ట్  ప్రాజెక్ట్ 'పెద్ది'(Peddi)తో  పాటు, రామ్ పోతినేని(Ram Pothineni)'ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra KIng Taluka)కి వర్క్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిన్మయి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 

Also read :  ఈ వారం మూవీ లవర్స్ కి పండగే.. థియేటర్, ఓటిటి రిలీజ్ ఇవే 

 

సింగర్ కార్తీక్ కూడా పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కార్తీక్ పై లైంగిక ఆరోపణల విషయంలో చిన్మయి నే ముందుకొచ్చి పోరాడింది. చిన్మయి భర్త ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్(Rahul ravindran). ఈ నెల 7 న పాన్ ఇండియా నటి రష్మిక(Rashmika Mandanna)ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ది గర్ల్ ఫ్రెండ్'(The Girl Friend)తో దర్శకుడిగా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.  

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.