Cheekatilo Movie Review: చీకటిలో మూవీ రివ్యూ
on Jan 23, 2026

మూవీ : చీకటిలో
నటీనటులు: శోభిత ధూళిపాళ్ళ, ఇషా చావ్లా, చైతన్య, అదితి, విశ్వదేవ్ రాచకొండ, సురేష్, రవీంద్ర విజయ్, జాన్సీ, ఆమని తదితరులు
సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్
మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు: డి. సురేష్ బాబు
దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి
ఓటిటి: అమెజాన్ ప్రైమ్ వీడియో
శోభిత దూళిపాళ్ల, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'చీకటిలో '(cheekatilo). అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కథేంటో ఓ సారి చూసేద్దాం...
కథ:
సిటీలోని ఓ ప్రముఖ వార్తా ఛానల్లో నెల్లూరు సంధ్య (శోభిత ధూళిపాళ్ల) యాంకర్ గా జాబ్ చేస్తుంటుంది. క్రైమ్ కథనాలను ప్రేక్షకులకు ప్రెజెంట్ చేస్తుండటం తనకి నచ్చడంతో.. ఈ జాబ్ ని సంధ్య పాషన్ తో చేస్తుంటుంది. అయితే తను టీఆర్పీల కోసం కాకుండా వాస్తవాలను జనాల్లోకి తీసుకెళ్ళాలని అనుకుంటుంది. దానికి ఆ ఛానెల్ ఎండీ ఒప్పుకోకపోవడంతో సంధ్య తన జాబ్ కి రిజైన్ చేస్తుంది. ఆ తర్వాత సంధ్య తన ఫ్రెండ్ బాబీతో (అదితి) కలిసి సొంతంగా ఒక పాడ్ కాస్ట్ ఛానల్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో అమర్ (విశ్వదేవ్ రాచకొండ) తో ప్రేమలో ఉంటుంది. సంధ్య, అమర్ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించిన ఆనందంలో ఉండగా.. బాబీ, ఆమె బాయ్ ఫ్రెండ్ దారుణంగా హత్యకు గురవుతారు. అయితే బాబీది హత్య కాదు..తనని ఎవరో అతిదారుణంగా అత్యాచారం చేసి చంపేస్తారు. ఆ హత్య చేసింది వాచ్ మెన్ అని సంధ్య గుర్తించడంతో కేసు క్లోజ్ అయిపోతుంది. అప్పుడే సంధ్యకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. తనని పట్టుకోలేక, ఓ అమాయకుడిని బలి పశువును చేశారంటూ అసలు హంతకుడు సంధ్యకు చెప్తాడు. దీంతో పోలీస్ ఆఫీసర్ రాజీవ్ (చైతన్య) తో కలిసి సంధ్య ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. సంధ్య ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుసుకుంది? కిల్లర్ ఎవరనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
క్రైమ్ థ్రిల్లర్ సినిమా అంటేనే ఆడియన్ ని మొదటి నుండి చివరి వరకు కూర్చోబెట్టేది. అయితే ఈ 'చీకటిలో' మూవీ మాత్రం మధ్యలోనే లేచివెళ్ళిపోయేలా చేస్తుంది. ఎందుకంటే సాధారణంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే జనాలు తెలుసుకుంటారు. కానీ ఓ పాడ్ కాస్ట్ చెప్పే అమ్మాయి క్రైమ్ కేసుని చెప్తుంటే తెలుసుకుంటారు. ఆమె ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు చెప్పడం.. దానిని జనాలు, మీడియా నమ్మి పోలీసులని ప్రశ్నించడం వింతగా ఉంటుంది. పోలీసులు కూడా ఓ పాడ్ కాస్ట్ చెప్పుకునే అమ్మాయిని ఫాలో అవ్వడం నవ్వు తప్పిస్తాయి. క్రైమ్ చేస్తాను పట్టుకోండి అని కిల్లర్ పోలీసులకి ఫోన్ చేయడం కూడా కాస్త అతి అనిపిస్తుంది. మొదలైన పది నిమిషాల వరకు బాగానే సాగినా ఆ తర్వాత మూవీ అంతా నత్త నడకన సాగుతుంది.
ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ ప్రోగ్రెసివ్ ఉండదు.. కొత్త పోలీస్ ఆఫీసర్లు వస్తూనే ఉంటారు. చివరి వరకు కిల్లర్ ఎవరో తెలియకుండా జాగ్రత్త పడినా.. కిల్లర్ ఎవరనే క్యూరియాసిటీని ఆడియన్ కి కలిగించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. మొదటి నుండి క్లైమాక్స్ వరకు కథా, కథనం రెండు స్లోగా సాగుతాయి. ఇదే పెద్ద మైనస్. ఇంకా కొంతమంది నటులని ఎందుకు తీసుకున్నారో ఎవరికి అర్థం కాదు. వాళ్ళు అయిదు నిమిషాలు కూడా కనపడకపోవడం కాస్త నవ్వు తెప్పిస్తుంది. లాజిక్ లేని సీన్లు బోలెడున్నాయి.
కిల్లర్ ని రివీల్ చేసే ట్విస్ట్ బాగుంది. అయితే కిల్లర్ గా మారడం వెనకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంత బలంగా లేదు. మాములుగా అనిపించింది. అయితే క్లైమాక్స్ లో మహిళల గురించి ఇచ్చిన ఓ మెసెజ్ బాగుంది. అడల్ట్ సీన్లు లేవు.. సెకంఢాఫ్ లో ఒక్కచోట ఫౌల్ వర్డ్ వాడారు. కిల్లర్ చంపేప్పుడు చూపించే సీన్లు తప్ప మిగతావేమి అంత భయంకరంగా అనిపించవు. క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడే వారికి కాస్త నచ్చే అవకాశం ఉంది. ఎడిటింగ్ లో చాలావరకు సీన్లని ట్రిమ్ చేస్తే బాగుండు. సినిమాటోగ్రఫీ ఓకే. బిజిఎమ్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
నెల్లూరు సంధ్యగా శోభిత ధూళిపాళ్ల, బాబీగా అదితి, అమర్ గా విశ్వదేవ్ రాచకొండ, రాజీవ్ గా చైతన్య తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : రొటీన్ క్రైమ్ థ్రిల్లర్.. జస్ట్ వన్ టైమ్ వాచెబుల్.
రేటింగ్: 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



