ఛార్మికి పోటీగా.. ఆర్తి
on May 27, 2015

మిసెస్ పరాంకుశం నవలను 'జ్యోతిలక్ష్మి'గా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. ఈసినిమాపై ఛార్మి గంపెడాశలు పెట్టుకొంది. ఇందులో జ్యోతిలక్ష్మిగా వేశ్య పాత్రలో కనిపించనుంది ఛార్మి. అటు గ్లామర్‌కీ ఇటు పెర్‌ఫార్మ్సెన్స్‌కీ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది. బోల్డ్ సీన్స్‌లో ఎలాంటి అభ్యంతరం లేకుండా నటించి ఛార్మి మార్కులుకొట్టేసిందట. ఇప్పుడు ఛార్మికి పోటీగా ఆర్తి అగర్వాల్ కూడా రంగంలోకి దిగిపోతోంది. జ్యోతిలక్ష్మిలాంటి బోల్డ్ క్యారెక్టరే ఆర్తి కూడా పోషిస్తోందిప్పుడు. ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలో క్యాబరే డాన్సర్ అనే ఓ చిత్రం తెరకెక్కనుంది.శివనాగు దర్శకత్వం వహిస్తారు. అన్నట్టు.. ఇదీ ఓ నవలకు ప్రతిరూపమే. చల్లా సుబ్రమణ్యం రచించిన క్యాబరే డాన్సర్ నవలను అదే పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఇందులోనూ బోల్డ్ సీన్లకు కొదవ లేదట. ఒకప్పుడు స్టార్ కథానాయికగా చలామణి అయిన ఆర్తి.. ఆ తరవాత అవకాశాల్లేక ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఒప్పుకొంది. గ్లామర్ తగ్గి, బరువు పెరిగి - కథానాయికగా ఇమేజ్ చేజార్చుకొంది. ఇప్పుడు ఈ పాత్ర కోసం కొత్తగా కసరత్తులు చేస్తోందట. బరువు తగ్గి, సరికొత్త అవతారంలో క్యాబరే డాన్సర్‌గా కనిపించబోతోందట. ఈ సినిమా అయినా ఆర్తి కెరీర్‌ని మారుస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



