నయనతారకి బిగ్ షాక్.. ఇలా జరుగుతుందని ఎవరు ఊహించలేదు
on Sep 10, 2025

స్టార్ హీరోయిన్ 'నయనతార'(Nayanthara)ప్రస్తుతం 'చిరంజీవి'(Chiranjeevi),అనిల్ రావిపూడి(Anil ravipudi)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మన శంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu)లో హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్ అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తుంది. నయనతారకి సంబంధించిన సినీ, వ్యక్తిగత జీవిత విషయాలని తెలియచేస్తు 'నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్ డాక్యుమెంటరీ' నెట్ ఫ్లిక్స్(Netflix)వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా 'నానుమ్ రౌడీ దానే' సినిమాలోని స్టిల్స్ వాడారని నయనతార పై స్టార్ హీరో ధనుష్(Dhanush)కేసు చేసిన విషయం తెలిసిందే. ఈ కోవలోనే డాక్యుమెంటరీలో తమ చంద్రముఖి మూవీ క్లిప్ ని ఉపయోగించారని నిర్మాతలు జనవరిలో చెన్నై హైకోర్టుని ఆశ్రయించారు. ఈ విషయంపై రీసెంట్ గా నయనతార, నెట్‌ఫ్లిక్స్‌కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సదరు నోటీసులపై అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని కూడా హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. నయనతార కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో చంద్రముఖి కూడా ఒకటి. రజనీకాంత్(Rajinikanth),ప్రభు, జ్యోతిక, పి వాసు కలయికలో వచ్చిన చంద్రముఖిలో అమాయకత్వం, ప్రేమ, కోపం కలగలిపిన గంగ క్యారక్టర్ లో అద్భుతంగా నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది. శివాజీ ప్రొడక్షన్స్ పై హీరో ప్రభు, ఆయన సోదరుడు రామ్ కుమార్ గణేశన్ కలిసి నిర్మించారు. 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



