చలపతి రావుతో తన చేదు అనుభవం వివరించిన నటి
on May 24, 2017

అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు అని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న సీనియర్ నటుడు చలపతి రావు, మీడియా ద్వారా క్షమాపణలు కోరుకున్నారు. కానీ, తాను చేసింది తప్పుడు వ్యాఖ్యలు కాదని తనని తాను సమర్ధించుకునే పనిలో... కథ మళ్ళీ మొదటికి తీసుకొచ్చాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చలపతి రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని చెప్పి, అతను ఆలా మాట్లాడే వ్యక్తి కాదని వీళ్ళు కూడా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం చలపతి రావు రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుకలో మాట్లాడింది అసలు నథింగ్ అని... అయన సెట్స్ లో అంత కన్నా దారుణంగా మాట్లాడుతారని వివరించింది.
బాహుబలి 2 లో పచ్చబొట్టేసిన సాంగ్ పైన తీవ్ర విమర్శలు చేసిన అన్నపూర్ణ సుంకర, ఈ విషయమై రియాక్ట్ అవుతూ, అసలు చలపతి రావు బ్రతకడానికి వీల్లేదు అని తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసారు. దీనికి స్పందిస్తూ, తెలుగు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి, చలపతి రావు తో తన చేదు అనుభవం గురించి వివరించింది. అసలు అయన ఆడియో వేడుకలో మాట్లాడింది పెద్ద విషయం కాదు... సెట్స్ లో ఆడవాళ్ళతో అంతకు మించి బూతులు మాట్లాడుతాడు. ఇంకా చీప్ కామెంట్స్ ఎన్నో చేస్తాడు. ఆయన్ని ఎవరు వ్యతిరేకించకపోగా, సమర్ధించే వాళ్లే ఎక్కువ అని పేర్కొన్నారు. నేను అయన విషయంలో ఏం చేయలేక పోవడం సిగ్గుగా అనిపించిందని తెలిపారు. చూద్దాం ప్రగతి లాగ ఇంకెవరెవరు ముందుకొస్తారో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



