మళ్ళీ బిజీగా మారిన కేథరిన్!
on Nov 30, 2021
`చమ్మక్ చల్లో` చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన కేథరిన్ ట్రెసా.. ఆపై `ఇద్దరమ్మాయిలతో`, `పైసా`, `ఎర్రబస్సు`, `రుద్రమదేవి` వంటి సినిమాల్లో మెరిసింది. అయితే, అల్లు అర్జున్ తో ముచ్చటగా మూడోసారి జట్టుకట్టిన `సరైనోడు` సినిమాతోనే టాలీవుడ్ లో తొలి హిట్ చూసింది మిస్ ట్రెసా. సదరు బ్లాక్ బస్టర్ మూవీ అనంతరం మరి కొన్ని తెలుగు చిత్రాల్లో మెరిసిన కేథరిన్ కి వాటిలో `నేనే రాజు నేనే మంత్రి` మాత్రమే సక్సెస్ అందించింది. ఇక ప్రీవియస్ మూవీ `వరల్డ్ ఫేమస్ లవర్` ఘోరపరాజయం తరువాత తెలుగు తెరపై మళ్ళీ కనిపించని కేథరిన్.. ఇప్పుడిప్పుడే తిరిగి బిజీ అవుతోంది.
నందమూరి కళ్యాణ్ రామ్ కి జోడీగా నటించిన `బింబిసార` త్వరలోనే విడుదలకు సిద్ధమవగా.. శ్రీ విష్ణుతో కలిసి నటిస్తున్న `భళా తందనాన` సెట్స్ పై ఉంది. అలాగే నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న పొలిటికల్ డ్రామా `మాచర్ల నియోజకవర్గం`లో కృతి శెట్టి మెయిన్ లీడ్ గా నటిస్తుండగా.. సెకండ్ లీడ్ గా ఎంటర్టైన్ చేయనుంది కేథరిన్. మొత్తమ్మీద.. వరుస చిత్రాలతో మళ్ళీ బిజీ తారగా మారిపోయిన కేథరిన్.. రాబోయే సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
