వర్మ గొంతుకు చుట్టుకున్న ట్విట్టర్..!
on Jun 16, 2016
సంచలనం అనే పదానికి పర్యాయపడమ్లా మారినపోయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. వివాదం-వర్మ ఎప్పుడూ కలిసే ఉంటాయి. సో, ఆయన కారణంగా ఓ వివాదం రేగిందని చెప్పుకోవడం మనకు కొత్తేమీ కాదు. కానీ ఈ కొత్త వివాదం ఏంటో మాత్రం తెలుసుకొందాం. తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తనకు నచ్చనివారిపై దుమ్మెత్తిపోసే వర్మ ఆ ట్విట్టర్ కారణంగానే ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. 2014లో వర్మ గణేష్ నిమజ్జనంపై చేసిన ట్వీట్లు హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉన్నాయని వివేక్ శెట్టి అనే వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో ముంబై కోర్టు రామ్ గోపాల్ వర్మకు సమన్లు జారీ చేసింది. జూలై 19 లోగా కోర్టులో హాజరు కావాలని లేదా, ఈ సమన్లకు సమాధానం చెప్పాలని కోర్టు పేర్కొంది. మరి ఈ కేసును వర్మ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి!