పవర్ స్టార్ రేంజ్.. రీమేక్ సినిమాకి 100 కోట్ల బిజినెస్!
on Jul 5, 2023

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. కలెక్షన్ల వర్షం కురుస్తుంది. అందుకే ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకాడరు. అందుకు తగ్గట్టుగానే పవన్ సినిమాల బిజినెస్ భారీగా జరుగుతుంది. ఆయన తాజా చిత్రం 'బ్రో' రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. రీమేక్ సినిమా, పైగా పవన్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ వంద కోట్ల బిజినెస్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మెగా ద్వయం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిసున్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. 'వినోదయ సిత్తం' రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి పవన్ చాలా తక్కువ డేట్స్ కేటాయించారు. అయినప్పటికీ పవన్ బ్రాండ్ తో ఈ సినిమా అదిరిపోయే బిజినెస్ చేస్తోందట. పైగా ఇటీవల విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ రావడంతో బయ్యర్లు పోటీ పడుతున్నారట. ఒక్క నైజాంలోనే రూ.30 కోట్లకు పైగా బిజినెస్ చేసిన బ్రో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఏకంగా రూ.85 కోట్ల బిజినెస్ చేసినట్లు వినికిడి. రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని అంటున్నారు. రీజినల్ సినిమా, పైగా రీమేక్ సినిమా.. అయినా ఈ రేంజ్ బిజినెస్ పవర్ స్టార్ కే సాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



