ENGLISH | TELUGU  

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

on Feb 2, 2026

 

 

-నిన్నబర్త్ డే వేడుకల్లో ఏం జరిగింది
-బ్రహ్మానందం స్పీచ్ లో ఏముంది
-సోషల్ మీడియా వేదికగా ఏం చెప్తున్నారు

 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది. ఐ యాం ఫైర్.. ఇలాంటి ఎన్నో ఊర కామెడీ డైలాగ్స్ కామెడీ కింగ్, మీమ్స్ గాడ్ పద్మశ్రీ బ్రహ్మానందం(Brahmanandam)నుంచి సుదీర్ఘ కాలం నుంచి వస్తు అభిమానులని ప్రేక్షకులకి బాధ కలిగినప్పుడుల్లా టాబ్లెట్స్ జోలికి వెళ్లే అవసరం లేకుండా చేస్తున్నాయి.

 

నిన్న బ్రహ్మానందం తన 70 వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులతో పాటు కొన్ని ప్రముఖ సంస్థలు ఆయన జన్మదిన వేడుకలని హైదరాబాద్ లో  ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బ్రహ్మ్మనందం మాట్లాడుతు నాది డెబ్భై వ పుట్టిన రోజు అని ఎవరు చెప్పారో కానీ డెబ్భై అని వేసి పడేసారు. ఏముందిలే అనుకోని నేను కూడా ఒకే అన్నాను. మీరంతా నా వయసు ఇంకా తక్కువ అనుకుంటున్నారు కదు అని చెప్పుకొచ్చాడు. ఆయన ఆ విధంగా మాట్లాడేటప్పుడు ముఖ కవళికల్లో తేడా కనపడుతుంది. దీంతో కొంత మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు బ్రహ్మ్మనందం ఏజ్ నిజంగా డెబ్భై కాదా, ఇంకా తక్కువనా, ఎక్కువనా అనే కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం తన దైన ఎంటర్ టైన్ మెంట్ కోణంలో ఆ విధంగా మాట్లాడారనే కామెంట్స్ చేస్తున్నారు.


Also read:  మగజాతి ఆణిముత్యం ఎవరు.. వైరల్ గా మారిన న్యూస్ 


ఏది ఏమైనా బ్రహ్మ్మనందం మాట్లాడిన మాటలు అభిమానులతో పాటు నెటిజన్స్ ని ఆకర్షిస్తున్నాయి. రాజా సాబ్ లో అలరించిన బ్రహ్మనందం మరిన్ని ప్రాజెక్ట్స్ లో చెయ్యాలని  అభిమానులు కోరుతున్నారు. 

  

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.