'పుష్ప'కు కొత్త టెన్షన్.. బాయ్ కాట్ పుష్ప అంటూ కన్నడిగుల కన్నెర్ర!
on Dec 16, 2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప మొదటి భాగం 'పుష్ప ది రైజ్' రేపు(డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో పుష్పకి ఊహించని పరిణామం ఎదురైంది. కర్ణాటకలో ఈ సినిమాని బహిష్కరించాలంటూ కన్నడిగులు పిలుపునిచ్చారు.
Also Read: సమంత సాంగ్ కాంట్రవర్సీపై రెస్పాండ్ అయిన అల్లు అర్జున్!
పుష్ప మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే కర్ణాటకలో పుష్ప మూవీ కన్నడలో కన్నా తెలుగు వెర్షన్ లోనే ఎక్కువ థియేటర్స్ లో విడుదలవుతోంది. ఇదే కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది. కర్ణాటకలో కన్నడ వెర్షన్ కంటే ఎక్కువగా తెలుగు వెర్షన్ విడుదల చేయడం ఏంటి? మా రాష్ట్రంలో మా భాషకు ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానిస్తారా అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మా భాషని అవమానిస్తే పుష్ప సినిమాని చూసేది లేదని చెబుతూ #BoycottPushpaInKarnataka హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మరి దీనిపై పుష్ప మేకర్స్, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: 'పుష్ప' 5వ షోకు అనుమతినిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ఇదిలా ఉంటే పుష్ప సినిమాని బహిష్కరించాలంటూ కన్నడిగులు #BoycottPushpaInKarnataka హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుంటే.. దానికి ధీటుగా అల్లు అర్జున్ అభిమానులు పుష్ప ఫేమస్ డైలాగ్ 'తగ్గేదేలే(#Thaggedhele)' ను ట్రెండ్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



