బౌగెన్ విలియా మూవీ రివ్యూ
on Dec 14, 2024

మూవీ: బౌగెన్ విలియా
నటీనటులు: కుంచకో బోబన్, ఫహద్ ఫాజిల్, జ్యోతిర్మయి, జిను జోసెఫ్, శోభి తిలకన్ తదితరులు
ఎడిటింగ్: వివేక్ హర్షన్
సినిమాటోగ్రఫీ: అనెంద్ చంద్రన్
మ్యూజిక్: సుశీన్ శ్యామ్
నిర్మాతలు: కుంచకో బోబన్, జ్యోతిర్మయి
దర్శకత్వం: అమల్ నీరద్
ఓటీటీ: సోని లివ్
కథ:
రాయ్స్ (కుంచకో బోబన్) అతని భార్య రీతూ (జ్యోతిర్మయి) ఇద్దరు కేరళలో ఉంటారు. వారికి ఇద్దరు పిల్లలు. ఒకసారి జరిగిన కారు ప్రమాదంలో రీతూ జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. రీతూ తన ఇద్దరు పిల్లల గురించి తరచూ ఆలోచన చేస్తుంటుంది. ఏదో తెలియని భయం ఆమెకి ఆందోళన కలిగిస్తుంటుంది. రాయ్స్ ఇంట్లో లేని సమయంలో ఆమె బాగోగులను పనిమనిషి 'రమ' చూసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో కేరళలో ఛాయా కార్తికేయన్ అనే యువతి కనిపించకుండాపోతుంది. ఆ యువతి గొప్పింటికి చెందినది. కనిపించకుండా పోవడానికి ముందు ఆమెను కలుసుకున్నది రీతూ మాత్రమే. అందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్ డేవిడ్ అనే పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. ఛాయా కార్తికేయన్ గురించి రీతూను డేవిడ్ అడుగుతాడు. తనకేమీ గుర్తులేదని ఆమె చెబుతుంది. ఆమె ఆరోగ్య సమస్యను రాయ్స్ చెప్పగా డేవిడ్ అర్థం చేసుకుంటాడు. అయితే మరికొంతమంది యువతులు కూడా అలాగే మిస్సయ్యారనే విషయం డేవిడ్ కి తెలుస్తుంది. అప్పుడు అతనేం చేస్తాడు? యువతుల మిస్సింగ్ వెనుక దాగి ఉన్న నిజాలేంటనేది మిగతా కథ.
విశ్లేషణ:
రెండు గంటల పదహారు నిమిషాల నిడివి ఉన్న ఈ కథ.. స్లోగా మొదలవుతుంది. మెయిన్ పాయింట్ ని రివీల్ చేయడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. రీతూ మానసిక పరిస్థితి చూస్తున్న ఆడియన్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు.. ఎప్పుడైతే డేవిడ్ పాత్ర ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుండి కథ వేగంగా పరుగులు తీస్తుంది.
మొదటి గంట నలభై నిమిషాల వరకు అసలు పాయింట్ కి రాకపోవడమే పెద్ద మైనస్. కానీ ప్రతీ పాత్రని కథలో లీనం చేసిన తీరు బాగుంది. ఇక అసలు కథలోకి వెళ్ళాక వచ్చే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మలయాళం సినిమాల్లో ఉండే స్లో అండ్ స్టెడీ థీమ్ ని ఇందులో కూడా వాడారు.ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే దీనికి అదనపు బలంగా నిలిచింది.
కొన్ని చోట్ల రక్తపాతం ఉంటుంది. అది మినహా కామన్ ఆడియన్స్ చూసేయొచ్చు. అయితే గంట సినిమా చూసాక.. అరెయ్ బాబు ఏంట్రా ఈ సినిమా తలనొప్పి వస్తోందని కామన్ ఆడియన్ కి అనిపించవచ్చు కానీ భిన్నమైన మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ సినిమాలో రాయ్స్ పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. వివేక్ హర్షన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. అనెంద్ చంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సుశీన్ శ్యామ్ బిజిఎమ్ ఆకట్టుకుంది.
నటీనటుల పనితీరు:
ఫైనల్ గా : వన్ టైమ్ వాచెబుల్ ఫర్ క్లైమాక్స్.
రేటింగ్ : 2.5/ 5
✍️. దాసరి మల్లేశ్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



